
చాలా మందికి సంపాదించేటప్పుడు ఖుషీగానే ఉంటుంది. కానీ ఆ ఆదా యాలపై Tax చెల్లించేటప్పుడే సమస్య, కష్టపడి సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలని తెగ బాధపడి పోతుంటారు. వీరికోసమేనా అన్నట్టు మన దేశంలో కొన్ని ఆదా యాలను Tax పోటు నుంచి పూర్తిగా మినహాయించారు. అటు వంటి పది ఆదాయాల గురించి తెలుసుకుందాం.
వ్యవసాయ ఆదాయం:
వ్యవసాయ ఆదాయానికి పూర్తి పన్ను మిన హాయింపు ఉంది. ఇందుకు ఎలాంటి పరిమితులు కూడా లేవు. అంటే మీకు ఉన్న సాగు భూమిలో పంటలు సాగు చేసి, ఆ పంటలను అమ్మడం ద్వారా లేదా మీ సాగు భూములను వేరొకరికి కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.5,000కు మించి, మీ మొత్తం ఆదాయం ప్రాథమిక మినహా యింపు పరిమితి మించి పోతే మాత్రం Tax రేటు లెక్కింపు కోసం పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంటారు.
పీపీఎఫ్ రాబడులు:
మన దేశంలో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారిలో ముఖ్యంగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ పథకంలో పెట్టే వార్షిక పెట్టుబ డుల్లో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద Tax మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంపై వచ్చే వడ్డీ, పథకం గడువు ముగిసిన తర్వాత చేతికి వచ్చే మొత్తానికి కూడా పూర్తి Tax మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులు పూర్తిగా ఎగ్జెంప న్, ఎగ్జెంప్షన్, ఎగ్జెంప్షన్ (ఈఈఈ) పరిధిలోకి వస్తాయి.
ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్:
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి వెనక్కి, తీసు కునే మొత్తాలపైనా చిల్లిగవ్వ కూడా ఆదాయ Tax చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి, కంపెనీ జమ చేసిన మొత్తాలతో పాటు ఈపీఎఫ్‌పై చెల్లించే వడ్డీకి కూడా ఇది వర్తిస్తుంది. కాకపోతే ఆ సొమ్మును విత్ డ్రా చేసుకునే వ్యక్తి ఈపీఎఫ్ లో కనీసం ఐదేళ్ల పాటు సభ్యుడై ఉండాలి. 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయ చట్టంలోనూ ఈ మినహాయింపు, వరుసగా ఐదేళ్ల కనీస కంట్రిబ్యూష నే నిబంధన కొనసాగనుంది.
జీవిత బీమా మెచ్యూరిటీ మొత్తం:
జీవిత బీమా (లైఫ్ ఇన్సూరె న్స్) పాలసీ గడువు (మెచ్యూ రిటీ) తీరినప్పుడు లేదా పాలసీ దారుడు మధ్యలోనే చని పోయినప్పుడు చెల్లించే మొత్తానికి పూర్తి Tax మినహాయింపు లభిస్తుంది. కాకపోతే ఇందుకోసం చెల్లించిన ప్రీమియం, పాలసీ కింద హామీ ఇచ్చిన మొత్తంలో 10 శాతానికి మించి ఉండకూడదు. అయితే పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే చెల్లించే మొత్తానికి మాత్రం ఇది వర్తించదు.
ఉపకార వేతనాలు: ఉపకార వేతనాల (స్కాల ర్షిప్ కింద చెల్లించే మొత్తాలకూ పూర్తి Tax మినహాయింపు లభిస్తుంది. కాకపోతే ఈ మినహాయింపు విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్‌లకు మాత్రమే వర్తిస్తుంది.
బహుమతులు
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల వంటి దగ్గరి బంధువుల నుంచి అందుకునే బహుమతు లకు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, ఆదాయాలకు ఎలాంటి పరిమితి లేకుండా పూర్తి Tax మినహాయింపు లభి స్తుంది. బంధువులు కాని వారి నుంచి అందే స్థిర లేదా చరాస్తుల బహుమ తుల వార్షిక విలువ రూ.50,000 మించితే మాత్రం Tax పోటు తప్పదు. దీన్ని ఇతర ఆదా యంగా పరిగణించి Tax విధిస్తారు. ఎలాంటి ప్రతి ఫలం లేకుండా వచ్చే స్థిరాస్తి బహుమతి స్టాంప్ డ్యూటీ రూ.50,000 మించి ఉంటే,Tax విధింపు కోసం ఆ స్థిరాస్తి మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు.
వీలునామా ద్వారా వారసత్వ ఆస్తులు
వీలునామా ద్వారా వచ్చే వారసత్వ ఆస్తులపై ఎలాంటి Tax పోటు ఉండదు. అయితే ఈ ఆస్తులపై వచ్చే ఆదాయాలు మాత్రంTax పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు ఎవరైనా చనిపోయిన వీలునామా లేదా తర్వాత వారి పేరు మీద ఉన్న బ్యాంకు వారసత్వ ఆస్తులు డిపాజిట్లు, రుణ పత్రాలు వారి వారసులకు బదిలీ అవుతాయి. వీటిపై వచ్చే వడ్డీ ఆదాయానికి వాటిని అందుకున్న వ్యక్తే ఆదాయ Tax చెల్లించాల్సి ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే డివిడెండ్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ ఆదాయాన్ని ఆయా వ్యక్తుల రెగ్యులర్ ఆదాయానికి జోడించి వారి శ్లాబుల ప్రకారం Tax విధిస్తారు. వీటి గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ఎస్ఐ)
సెక్షన్ 80సీ కింద సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ఎస్ఐ) పథకంలో పెట్టుబడులకు, ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పూర్తి Tax మిన హాయింపు లభిస్తుంది. ఈ పథకంపై లభించే వడ్డీ మెచ్యూరిటీ మొత్తాలకీ పూర్తి Tax మినహాయింపు లభిస్తుంది. దేశంలో బాలికల భవిష్యత్ ఆర్థిక అవసరా లను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని పొందించారు. దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి
Tax ఫ్రీ బాండ్స్:
ప్రభుత్వం లేదా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు Tax ఫ్రీ బాండ్స్ (రుణ పత్రాలు) జారీ చేస్తుం టాయి. ఈ బాండ్స్‌పై వచ్చే వడ్డీ ఆదాయానికి పూర్తి Tax మిన హాయింపు లభిస్తుంది.
గ్రాట్యుటీ:
ప్రభుత్వ ఉద్యోగులకు అందే గ్రాట్యూటీకి పూర్తి Tax మినహా యింపు లభిస్తుంది. అదే ప్రైవేటు ఉద్యోగులైతే ఆదాయ Tax చట్టం నిబంధనలకు లోబడి రూ.20 లక్షల వరకే పన్ను మిన హాయింపు లభిస్తుంది.