
ప్రపంచంలో అతి శక్తిమంతమైన సాఫ్ట్వేర్ లినక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఏటీఎంలు, ‘అంతరిక్ష నౌకలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డేటా సెంటర్లు, ప్రపంచవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ… ఇవన్నీ లినక్స్ ఆధారంగా పని చేస్తాయి. ఈ అద్భుతమైన ఓపెన్ సాఫ్ట్వేర్ రూపకల్పన, నిర్వహణలో ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలో’గా తెలుగు మహిళ షువాఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగానూ ఆమె చరిత్రకెక్కారు. అపూర్వమైన Shuah khan గురించి తెలుసుకొందాము.
Shuah khan స్వస్థలం ఒంగోలు. ఆమె తండ్రి ప్రభుత్వ పశువైద్యాధికారి కావడంతో… షువాఖాన్ చదువు రాష్ట్రంలోని పలుచోట్ల సాగింది. మారుమూల పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, బాపట్ల ఏబీఎం, సర స్వతీ మెమోరియల్ పాఠశాలల్లో చదువుకున్నారు. మోదుకూరులో పదోతరగతి పూర్తి చేశారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా యూని వర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువు కొని ఎదిగానని ఆమె సగర్వంగా చెప్పుకుం టారు.
Shuah khan భారత్లో కొన్నేళ్ళు పని చేసిన తరువాత… 1988లో అమెరికా లోని కొలరాడో స్టేట్ యూనివ ర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ పూర్తి చేశారు. బే ఏరియాలో తొలి ఉద్యోగం అనంతరం ‘లూసెంట్ ఏటీ అండ్ టీ బెల్ ల్యాబ్స్’లో పని చేశాక… హ్యూలెట్ . ప్యాకర్డ్ (హెచ్పీ)లో పద మూడేళ్ళు సేవలు అందించారు. ఆ సమయంలోనే లినక్స్లో ఆమెకు ప్రత్యక్ష అనుబంధం ఏర్పడింది. హెచ్పీ హార్డ్వేరు లినక్స్ అనుసంధానించే ప్రాజె క్టులో లినక్స్ డెవలపర్లకు నేరుగా సహకరించే అవకాశం వచ్చింది. 2007లో ఓపెన్ సోర్స్ రంగంలో అడుగుపెట్టారు. 2011 నుంచి స్వతంత్ర లినక్స్ కంట్రీ బ్యూటర్ గా మారారు. తరువాత అయిదేళ్ళు శాంసం గ్లో పని చేశారు. లినక్స్ ఫౌండేషన్ సాంకేతిక సలహా దారుల మండలి చొరవతో ప్రారంభించిన కె-సెల్ఫ్ టెస్ట్’ నిర్వాహకురాలుగా… 2014లో ఆ ఫౌండేషన్ సభ్యురాలుగా చేరారు.
లినక్స్ నడిపించే లినక్స్ కర్నెల్ నిర్వహణ సున్నిత మైన, భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉంది. కర్నెల్ కోడ్లో చిన్న పొరపాటు పెనుముప్పునకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని నిర్వహణ, భద్రత కేవలం ముగ్గురి చేతుల్లో మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లతో పాటు… తమ వాణిజ్య ప్రయోజనాలకి సంబంధించిన అవసరాల మేరకు కంపెనీలు సమర్పించే కర్నెల్ కోడ్ అప్డేట్స్న సమీక్షించడంతోపాటు.. లినక్స్పై ఆధారపడే వారంద రికీ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను ఈ త్రిసభ్య బృందం పర్యవేక్షిస్తుంది.
ఈ బృందానికి జీతభత్యాలు, చట్టపర మైన రక్షణ అందించే నిమిత్తం ‘లినక్స్ ఫౌండేషన్’ ఏర్ప డింది. ఈ త్రిసభ్య బృందాన్ని ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలో’ లుగా పిలుస్తారు. లినక్స్ నుంచి లబ్ధి పొందే దిగ్గజ సంస్థలు ఈ ఫౌండేషన్లో సభ్యులుగా చేరి… కర్నెల్ అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడంతో పాటు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. తద్వారా ‘లినక్స్ కర్నెల్ పై గుత్తాధిపత్యానికి తావులేకుండా.. కేవలం దాని అభివృద్ధిని, భద్రతను సమీక్షించే వనరులను మాత్రమే కల్పిస్తారు. అంటే కర్నెల్ డెవలపర్లకు, కార్పొరేట్ సంస్థలకు మధ్యవర్తిగా లినక్స్ ఫౌండేషన్ వ్యవహ రిస్తుంది. అయినప్పటికీ కర్నెల్ వ్యవహారాల్లో ఈ ఫౌండే షన్ జోక్యం చేసుకోదు.
లినక్స్ ఫౌండేషన్ ఫెలో… ఓపె న్-సోర్స్ ప్రపంచంలో లభించే అత్యున్నత గౌరవం. ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో దీర్ఘకాలంగా సేవలందిం చడం,, విలువైన సాఫ్ట్వేర్ కోడ్ అందించడం, నాయ కత్వం లాంటి వాటికి గుర్తింపుగా ఈ సభ్యత్వం లభి స్తుంది. 1991లో మొదలైన లినక్స్ ప్రయాణంలో ఇప్పటి వరకూ కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ ఫెలో హోదా పొందారంటేనే దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. ఆ ముగ్గురు ‘లినర్స్ ఫౌండేష న్’ ద్వారా నేరుగా ‘లినక్స్ కర్నల్’ అభివృద్ధికి పూర్తి సమయం కృషి చేస్తు.. న్నారు. లినక్స్ ఫౌండేషన్ ఫెలో అయిన తొలి మహిళగా Shuah khan ఘనత సాధించారు. Shuah khan గురించి మరింత సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Shuah khan 2019 నుంచి .లినక్స్ ఫౌండేషన్ ఫెలోగా లినక్స్ కర్నెల్ నాణ్యతను కాపాడే బాధ్యత నిర్వహిస్తు న్నారు. లినక్స్ కర్నెల్ మెయింటెయినర్గా వ్యవహ రిస్తూ.. లినక్స్ సెల్ఫ్ స్ట్ ఫ్రేమ్ వర్క్, క్లౌడ్ కంప్యూటిం గ్లో విస్తారంగా ఉపయోగపడే యూఎస్బీ ఓవర్ ఐపీ డ్రైవర్ లాంటి సబ్ సిస్టమ్స్ ను పర్యవేక్షిస్తున్నారు. డెవల పర్లు తమ మార్పు వల్ల కర్నెలకు ఎలాంటి నష్టం జరగ దని నిర్ధారించుకోవడానికి వీలు కల్పించే కె-సెల్ప్ టెస్ట్ రూపొందించడంలో, ఆండ్రాయిడ్ డ్రైవర్లను మెయిన్ లైన్ లినక్స్లో విలీనం చేసే ప్రయత్నాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. వీటి ఆధారంగా, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో సేవల ఆధారంగా ఆమెను ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలోగా ఎంపిక చేశారు. ‘రోజువారీ పనిలో భాగంగా.. డెవలపర్లు రాసిన కోడు సమీక్షిస్తాను. అది అప్పటికే ఉన్న సిస్టమ్తో సరిగ్గా కలుస్తుందా? దానివల్ల కర్నెల్ పాడవుతుందా? నాణ్యతా ప్రమాణాలకు అది అనుగుణంగా ఉందా? లాంటి అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాను. ఇది ఒక సాంకేతిక న్యాయ మూర్తి లాంటి పాత్ర” అంటారు Shuah khan
Shuah khan యువ డెవలపర్లను తీర్చిదిద్దడంలోనూ ఆమె శ్రద్ధ వహిస్తు న్నారు. ‘లినక్స్ ఫౌండేషన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్’ను స్థాపించి, నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాదిమంది కొత్త డెవలపర్లను కర్నిల్ అభి వృద్ధిలోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో రిమోట్గా పాల్గొనే అవకాశం ఉంది. స్టైఫండ్ కూడా ఇస్తారు. మహిళలు కర్నెల్ కమ్యూనిటీలో మరింత కీలకంగా వ్యవహరించేలా షువా చొరవ తీసుకుంటున్నారు.
మెంటర్షిప్ ప్రోగ్రామ్లో తన అనుభవాల గురించి Shuah khan మాట్లాడుతూ ‘కొందరు విద్యార్థులు కృత్రిమ మేధ ద్వారా తయారు చేసిన కోడ్ను సమర్పిస్తున్నారు. కానీ కోడ్ సమీక్ష సమయంలో దాని వెనుక ఉన్న అస లైన ఆలోచన, అవగాహన విద్యార్థుల్లో కొరవడుతు న్నాయి. అందుకే ముందుగా మౌలిక అంశాలను లోతుగా అధ్యయనం చేశాక… అవసరమైన సాంకేతిక సహాయాన్ని వినియోగించాలి.దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి
సాఫ్ట్వేర్ రంగంలో తార్కిక, సృజనాత్మక అంశాలు రెండూ కలిసి ఉంటాయి. ఓపెన్ సోర్స్ రంగం నాకు స్వేచ్ఛ ఇచ్చింది. కార్పొరేట్ సంస్థల్లో వారి వాణిజ్య అవసరాలకు అనుగు ణంగా పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లతో సమన్వయం చెయ్యడం, వారికి సహకరించడం, మెంటార్ గా పని చెయ్యడం లాంటి అంశాలు నన్ను ముందుకు నడిపిస్తు న్నాయి” అని చెబుతున్నారు Shuah khan.
సాంకేతికంగా కఠినమైన లినక్స్ కర్నెల్ లాంటి రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అక్కడ నుంచి గవర్నెన్స్ స్థాయికి ఎదగడం, ఓపెన్ సోర్స్ విలువలను కాపాడే ప్రయత్నం చేయడం, గ్లోబల్ టెక్ గవర్నెన్స్లో కీలక పాత్ర పోషించడం లాంటివి Shuah khan కు ప్రపంచవ్యా ప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి.