యూపిఎస్సి Rank కొట్టిన జినియా అరోరా,రాజేశ్వరి సువే

సివిల్స్… కోట్లాదిమంది కల. లక్షలమంది పోటీ పడితే లక్ష్యాన్ని ఛేదించగలిగేవారు అతి కొద్దిమంది. ఈ ఏడాది 299 మంది మహిళలు Rank సాధించారు. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదన డానికి నిలువెత్తు సాక్ష్యం.. జినియా అరోరా. గత సివిల్స్ పరీక్షల్లో 156వ Rank సాధించిన ఆమె… ఐపీఎస్ అధికారిణి అయ్యారు. కానీ అది సంతృప్తిని వ్వలేదు. జినియా లక్ష్యం… ఐఏఎస్. దాని కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఆరో ర్యాంకు సాధించి… కలను నిజం చేసుకున్నారు.


ఏదైనా సాధించాలనే తపన ఉంటే… దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. జినియా జర్నీ ఇదే చెబుతోంది. సమాజం పట్ల ప్రేమ, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్న ఆశయం… ఇవే ఆమెను ఉన్నతంగా నిల బెట్టాయి. సొంతంగా ఒక స్వచ్చంద సంస్థను నిర్వ హిస్తున్న జినియా విద్యాభ్యాసం ప్రముఖ విద్యా సంస్థల్లో సాగింది. ఢిల్లీ సంస్కృతి స్కూల్లో పాఠ శాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె మొదటి నుంచీ సోషల్ సైన్సెన్స్, పబ్లిక్ అఫైర్స్ప ఆసక్తి చూపారు. ఢిల్లీ విశ్వవిద్యాంలయం నుంచి ఎకనా మిక్స్, పొలిటికల్ సైన్స్ (2022)లో బీఏ పూర్తి చేశారు. బ్యాచ్ టాపర్ నిలిచారు.

తరువాత పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందిన వారికి మాత్రమే సివిల్ సర్వీసెస్లో మంచి Rankలు వస్తాయని కొందరికి భావన ఉంటుంది. అలాంటి భావన తప్పని నిరూపించారు చత్తీస్ గఢ్ కు చెందిన వైభవ అగర్వాల్. డిగ్రీ దాకా హిందీ మీడియంలో చది. విన వైభవికి ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 35వ Rank లభించింది. నేను 2021 నుంచి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇంతకు ముందు రెండు సార్లు పరీక్షలు రాశాను. కానీ విజయం సాధించలేకపో యాను. ఇక్కడ నేను ఒక విషయం అందరికీ చెప్పాలను
పర్యావరణం, సామాజిక సమస్యలపై దృష్టి పెట్టిన జిని.. మరుసటి ఏడాది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చదివారు.


పేజీ తరువాత సివిల్స్ సాధించాలన్న ఏకైక సంక ల్పంతో అడుగులు వేశారు జినియా, పట్టుదలతో, ప్రయత్నించారు. 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)లో 156వ Rank దక్కించుకున్న ఆమెను ఐపీఎస్ కు కేటాయించారు. గత ఏడాది సర్వీస్ లో చేరిన జినియా.. అంతటితో సరిపెట్టుకోలేదు. ఐఏఎస్ సాధించాలన్న తన కల నెరవేర్చుకొనేందుకు మరింత కష్టపడ్డారు. పరీక్షలు, ఆ తరువాత జరిగే ఇంటర్వ్యూలకు వ్యూహాత్మకంగా సన్నద్ధమయ్యారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్ను ఆప్షనల్ సబ్జెక్ట్స్ గా ఎంచుకున్న ఆమె.. తాజా సివిల్స్ ఫలితాల్లో 6వ Rank సొంతం చేసుకున్నారు.

జినియాది విద్యావంతుల కుటుంబం. ఆమె తల్లి తండ్రులు రాజీవ్ కుమార్ అరోరా, అంజన… ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అంజన డిప్యూటీ ఎక్సైజ్, టాక్సే షన్ కమిషనర్ రిటైర్ అయ్యారు. వారిలోని నాయ కత్వ లక్షణాలు, సామాజిక దృక్పథం ఆమెకు ప్రేరణ, ముఖ్యంగా తల్లి స్ఫూర్తితో సేవా మార్గం వైపు ఆడు గులు వేశారు. కొంతమంది స్నేహితులతో కలిసి ‘పేస్ ఎక్స్’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితితో పాటు వివిధ దేశాలతో కలిసి ప్రధానంగా శాంతి స్థాపనకు ఈ సంస్థ కృషి చేస్తోంది. చిన్నప్పుడే సేవామార్గం పట్టిన జినియా.. ఒక ఐఏఎస్ అధికారిగా సమాజంలో మరింత మార్పు తీసుకురావచ్చని భావించారు. దానికోసమే పట్టుబట్టి ర్యాంకు సాధించారు.

రాజేశ్వరి సువే:


అసాధ్యం అనే పదాన్ని సుసాధ్యం చేసి చూపించారు మదురైకి చెందిన రాజేశ్వరి సువే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా ఆమె కుంగిపోలేదు. శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశంలో ” అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో దేశంలోనే రెండో Rank సాధించి, సుసాధ్యం చేసి చూపించారు.దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి

తమిళనాడులోని మదురై జిల్లా వాడిపట్టికి చెందిన రాజేశ్వరిది విద్యావంతుల కుటుంబం. తండ్రి మురుగేశన్ వ్యాపారవేత్త కాగా, తల్లి ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్, ఇంట్లోని విద్యా వాతావరణం, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాడె టీ గా పొందిన క్రమశిక్షణే ఆమెను సివిల్స్ వైపు నడిపిం చాయి. చెన్నైలోని వెల్టిక్ మల్టీటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఎలాగైనా దేశ సేవలో భాగం కావాలని అనుకున్నారు.
తెలియని ప్రశ్నలు ఎదురైన ప్పుడు తడబడకుండా చాలా హుందాగా ‘తెలియదు’ అని చెప్పడం ఆమె నిజాయితీకి నిదర్శనం. ముఖ్యంగా తమిళనా దులోని సామాజిక అంశాలు, పరిపాలన సంస్కరణలపై ఆమె ఇచ్చిన విశ్లేషణలు ఆమెకు అత్యుత్తమ మార్కులు తెచ్చిపెట్టాయి.


రాజేశ్వరి ప్రిపరేషన్ శైలి చాలా ప్రత్యేకం. ఆమె కేవలం పుస్తకాలను చదవడమే కాకుండా ప్రతి అంశంపైనా తనదైన శైలిలో షార్ట్ నోట్స్ తయారుచేసుకునేవారు. సమాజంపై అవ గాహన పెంచుకునేందుకు సోషియాలజీని ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నారు. దినపత్రికలను చదవడం ద్వారా వర్తమాన అంశాలపై పట్టు సాధించారు. ఇప్పటికే గ్రూప్-1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి విధి నిర్వ హణలో ఎదురయ్యే సవాళ్లను తన ఇంటర్వ్యూ సమాధానా లకు ముడిపెట్టి బోర్డు సభ్యులను మెప్పించారు. మరింత సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఇంటర్వ్యూ బోర్డు ముందు రాజేశ్వరి చాలా ఆత్మవిశ్వాసంతో బోర్డు సభ్యులను మెప్పించారు. మహిళా సాధికారత అనేది కేవలం చదువుతో ఆగిపోకూడదని, ఆది ఆర్థిక స్వయం ప్రతిపత్తికి దారితీయాలని రాజేశ్వరి బలంగా నమ్ముతారు. మహిళలు సొంత నిర్ణయాలు తీసుకోగలిగే స్థితిలో ఉండాలంటే వారికి ఆర్థిక వనరులపై పట్టు ఉండా అని చెబుతారు. కేవలం ఉద్యోగం చేయడమే సాధికారత కాదని, సామాజిక మార్పులలో మహిళలు చురుకైన పాత్ర పోషించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలు పెదపెద్ద కలలు కనాలని, అందుకు తన వంటి వారు ఒక ఉదాహరణగా నిలవాలని ఆమె కోరుకుంటున్నారు.

రెండో Rank వచ్చిన వారు సహజంగా ఐఏఎస్ ఎంచు కుంటారు. కానీ రాజేశ్వరి మాత్రం తన లక్ష్యం ఐపీఎస్ అని స్పష్టంగా చెప్పారు. ఎన్స్నీ రోజుల్లో యూనిఫాం ధరించిన ప్పుడు కలిగిన గర్వం, మహిళల భద్రత కోసం పనిచేయా అనే తపన తనను ఐపీఎస్ వైపు నడిపించాయని ఆమె చెప్పుకొచ్చారు. ఐఏఎస్ కంటే ఐపీఎస్ ద్వారా ప్రజలకు తక్షణ రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని ఆమె నమ్ము తారు. పట్టుదల ఉంటే ప్రతి ఆపజయం ఒక విజయానికి పునాది అవుతుందని రాజేశ్వరి నిరూపించి ఎందరో అభ్య ర్థుల్లో స్ఫూర్తి నింపారు.


ఓర్పుతో కష్టపడండి… నేను చేసిన తప్పులను గమనించాను. విజయం సాధించాను. ఇక సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకొనేవారికి నేను చెప్పే సూచన ఒకటే. మీ లక్ష్యం చేరుకొనే దాకా చదువు తూనే ఉండండి. కొద్ది రోజులు చదివి.. కొద్ది రోజులు మానేయటం వల్ల ఫలితం ఉండదు. మనకు ఫలితం లభించటానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దాని కోసం ఓర్చుతో వేచి చూడాల్సి ఉంటుంది..” అని తన విజయ ప్రస్థానాన్ని చెబుతూ మనకు విజయం లభించలేదంటేనే ఎక్కడో తప్పు జరుగు తున్నట్టు లెక్క. ఆ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో గమనిస్తే విజయం మనదే అవుతుంది. దీనికి నేనే పెద్ద ఉదాహరణ.

Leave a Comment