
India-ఫ్రాన్స్ మధ్య రక్షణ సంబంధాలు ‘ఎవరెస్ట్’ స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగరగలిగే ఎయిర్బస్ హెచ్-125 హెలికాప్టర్లు, హ్యామర్ క్షిపణులను India-ఫ్రాన్స్ సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి. రక్షణ అంశాల్లో సమన్వయం, సమగ్రత కోసం ఇరు దేశాల సైన్యంలో పలువురు సైని కాధికారులను పరస్పరం నియమించుకోనున్నాయి. మొత్తంగా రక్షణ, కీలక ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికతలు, ఆరోగ్య రంగాల్లో పర స్పర సహకారం కోసం భారత్-ఫ్రాన్స్ మధ్య 21 ఒప్పందాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ మంగళవారం సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ‘ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం’గా ఇరువురు ఎవరెస్టు ఎత్తుకు చేరగలిగే ఎయిర్బస్ హెచ్-125 హెలికాప్టర్లు, హ్యామర్ క్షిపణుల ఉమ్మడి తయారీ కర్ణాటకలోని వేమగల్లో టాటా ఎయిర్బస్ యూనిట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సాంకేతికతలు, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కోసం ‘India-ఫ్రాన్స్ సృజనాత్మక సంవత్సరం-2026’ రక్షణ, ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం 21 ఒప్పందాలు సంతకాలు చేశారు..
ముంబైలోని మహారాష్ట్ర లోకభవన్లో ప్రధాని మోదీ, మేక్రాన్, విదే శాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఫ్రాన్స్ రక్షణ అధికారులు భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మేక్రాన్ ఇద్దరూ కలిసి కర్ణాటకలోని వేమగల్లో ఏర్పాటు చేస్తున్న టాటా-ఎయిర్బస్ సంస్థల సంయుక్త ‘హెచ్125 లైట్ యుటిలిటీ హెలి కాప్టర్ ఫైనల్ అసెంబ్లింగ్ యూనిట్ను వర్చువల్గా ప్రారంభించారు.
మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నాలుగో సారి India వచ్చారు. ఈసారి 3 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తెల్లవారుజామునే ముంబైకి చేరుకున్న ఆయన.. తీరంలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో జాగింగ్ చేశారు. అనంతరం తన సతీ మణి బ్రిగిట్టేతో కలిసి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలోని స్మారకం వద్ద 26/11 ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
మేక్రాన్ ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొననున్నారు. ఆ ఒప్పందాల ప్రకారం ఇరుదేశాల రక్షణ సహకార ఒప్పందాన్ని పదేళ్లు పొడిగించారు. ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్లను కర్ణాటకలోని వేమగల్లో ఏర్పాటు చేస్తున్న టాటా-ఎయిర్బస్ ప్లాంట్ ఉత్పిత్తి చేయనున్నారు. ప్రతికూల వాతావరణాన్ని సమర్ధవంతంగా తట్టుకుని, ఎవ రెస్ట్ శిఖరం వరకు కూడా చేరుకోగల సామ సామర్థ్యం ఈ యూటిలిటీ హెలికాప్టర్ సొంతం.
దీనిని India చేయడమేగాకుండా విదేశాలకు విక్ర యించేందుకూ తాజా ఒప్పందం వీలుకల్పించ నుంది. 2027 మార్చి నాటికి తొలి మేడిన్ ఇండియా హెచ్-125 హెలికాప్టర్ను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల హ్యామర్ క్షిపణులను కూడా India ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇందుకోసం హ్యామర్ క్షిపణులను అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేయను న్నాయి.గురించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయో గించగలిగే ఈ హ్యామర్ క్షిపణుల సామర్థ్యం గరి ష్టంగా 70 కిలోమీటర్లు.
ఇరుదేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించేం దుకు వీలుగా… ఇరువైపులా పన్ను (డబుల్ ట్యాక్సే షన్) లేకుండా ఒప్పందం కుదిరింది.ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విమానయాన రంగాల్లో పరస్పర సహకారం కోసం ప్రత్యేక ఇండో-ఫ్రెంచ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక ‘India-ఫ్రాన్స్ సృజనాత్మక సంవత్సరం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని మోదీ, మేక్రాన్ ప్రారంభించారు.
రెండు దేశాల ఆవిష్కరణలను సమన్వయం చేసేందుకు ‘ఇండో- ఫ్రెంచ్ ఇన్నోవేషన్ నెట్వర్క్’ను ఏర్పాటు చేస్తారు. ‘ఇన్నోవేషన్ ఇయర్’ కార్యక్రమంలో భాగంగా హైద రాబాద్కు చెందిన ధ్రువ స్పేస్, కర్ణాటకకు చెందిన పిక్సెల్ స్పేస్ సంస్థలు ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ ఎక్సో ట్రెయిల్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ధ్రువ, పిక్సెల్ సంస్థలు ప్రయోగించే ఉపగ్రహాలకు అవస రమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను ఎక్సోట్రె యిల్ సరఫరా చేయనుంది.
India-ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యానికి ఎలాంటి సరిహద్దులూ లేవు. సముద్రపు లోతుల నుంచి ఎత్తయిన పర్వత శిఖరాల వరకు ఈ భాగస్వామ్యం విస్తరించగలదు. హెచ్-125 హెలికాప్టర్ల ఉమ్మడి తయారీ అంశం ఇరు దేశాల మధ్య లోతైన నమ్మకానికి చిహ్నం” అని మోదీ చెప్పారు. ఫ్రాన్స్క భారత్ అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని మేక్రాన్ పేర్కొన్నారు.దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి
కర్ణాటక లోని కోలారు జిల్లా వేమగల్లో టాటా-ఎయిర్బస్ యూనిట్ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వర్చువల్ ప్రారంభించగా. వేమగల్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్, విమానయాన మంత్రి రామ్మోహన్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరిన్ పాల్గొన్నారు. ఇక్కడ హెచ్ 125 తోపాటు మిలిటరీకి అవ సరమైన హెచ్ 125ఎం హెలికాప్టర్లనూ తయారు చేయనున్నారు.